|
04:39 (1 minute ago) |
|
||
|
పరీక్షకు ముందు రోజు
పరీక్షకు ఒకరోజు ముందు అభ్యర్థులు సబ్జెక్ట్ ప్రిపరేషన్ కంటే.. పరీక్షకు హాజరయ్యేందుకు అవసరమైన వాటిని సిద్ధం చేసుకోవాలి. హాల్ టికెట్, పెన్నులు, అవసరమైన గుర్తింపు పత్రాలు అన్నింటినీ దగ్గర పెట్టుకోవాలి.
ఆరోగ్యం జాగ్రత్త
పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు రేయింబవళ్లు శ్రమిస్తేనే మంచి మార్కులు వస్తాయని భావిస్తుంటారు. పరీక్ష ముందు రోజు కూడా ఇలా అర్థరాత్రి వరకూ చదవుతూ ఉంటారు. ఇది మరుసటి రోజు పరీక్ష హాల్లో ప్రదర్శన తీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి మనసుకు విశ్రాంతి లభించేలా సేద తీరాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరవ్వాలి.
గ్యాప్లో చర్చలు వద్దు
గ్రూప్ 4 మొదటి పేపర్ తర్వాత రెండో పేపర్ ప్రారంభానికి రెండు గంటల వ్యవధి ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులు.. సహచరులతో మొదటి పేపర్లో గుర్తించిన సమాధానాల గురించి చర్చించడం వంటివి చేయడం సరికాదు. దీనివల్ల అనవసరపు ఒత్తిడి ఏర్పడి రెండో పేపర్పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఎగ్జామ్ డే టిప్స్
వీలైనంత ముందుగా హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
పరీక్ష రోజు నిర్దేశిత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
• సమాధానాలు ఇచ్చే ముందు ప్రశ్న పత్రం పరిశీలనకు సమయం కేటాయించాలి.
సులభమైన ప్రశ్నలతో ప్రారంభించి.. ఓ మోస్తరు క్లిష్టత, ఆ తర్వాత బాగా క్లిష్టంగా ఉన్న ప్రశ్నలపై దృష్టి పెట్టాలి.
తమకు వచ్చిన అన్ని సమాధానాలు గుర్తించామని భావించాకే గెస్సింగ్, ఎలిమినేషన్ విధానాన్ని అనుసరించాలి.
ALL THE BEST
|
MATER TV7 YOUTUBE CHANNEL |
Comments
Post a Comment